ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కే జి ఎఫ్ 2. కేజిఎఫ్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇటీవల యశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను యూనిట్ రిలీజ్ చేసింది. ఈ టీజర్ రిలీజ్ అయిన 12 గంటల్లోనే 25 మిలియన్లు వ్యూస్ సాధించి రికార్డ్ కు ఎక్కింది. ఇక లైక్ ల విషయంలో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. అతి తక్కువ సమయంలో మిలియన్ లలో లైక్ లు సాధించిన తొలి టీజర్ గా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది.
ఇదిలా ఉంటే ఈ చిత్ర టీజర్ కు సంబంధించి తాజాగా దర్శకుడు, హీరో, నిర్మాతలకు నోటీసులు అందాయట. కర్ణాటక స్టేట్ యాంటీ టొబాకో సెల్ ఈ నోటీసులు పంపించిందట. టీజర్ చివర్లో యశ్ తుపాకీ తో వాహనాలు కాల్చిన తరువాత తుపాకీ గొట్టం తో సిగరెట్ ముట్టిస్తూ కనిపిస్తాడు. ఆ సీన్స్ చూపించేటప్పుడు యాంటీ స్మోకింగ్ వార్నింగ్ చూపించకపోవడం వల్లే ఈ నోటీసులు ఇచ్చారట.