77 చార్లీ అనే సినిమా చూసి కంటతడి పెట్టని వారు ఉండరు. తాజాగా.. ఈ సినిమా చూసి ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రే ఎక్కి ఎక్కి ఏడ్చారు. పెంపుడు కుక్కతో ఒక వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని కండ్లకు కట్టినట్టు చూపించారు చిత్రంలో.
అయితే.. చనిపోయిన తన పెంపుడు కుక్క గుర్తుకొచ్చి భావోద్వేగానికి గురయ్యారు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై. అందుకు సంబంధించిన ఫోటోలో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా చూసిన అనంతరం సీఎం బొమ్మై మాట్లాడుతూ.. కుక్కల గురించి చాలా సినిమాలు వచ్చాయి. కానీ.. ఈ సినిమాలో జంతువులతో ఉండే అనుబంధం, భావోద్వేగాన్ని చాలా గొప్పగా చూపించారని కొనియారు.
కుక్క తన భావోద్వేగాలను కండ్ల ద్వారా వ్యక్తపరుస్తుందని వివరించారు. సినిమా చాలా బాగుందని.. అందరూ చూడదగిన సినిమా అన్నారు. కుక్కల ప్రేమ అనేది షరతులు లేని ప్రేమ అని కొనియాడారు. ఇది స్వచ్ఛమైన ప్రేమ అని అన్నారు.
సీఎం బొమ్మై స్వతహాగా కుక్కల ప్రేమికుడు. గతేడాది తన పెంపుడు కుక్క చనిపోవడంతో ఆయన చాలా బాధపడ్డారు. పెంపుడు కుక్క మరణాన్ని జీర్ణించుకోలేక ఆయన బోరున విలపిస్తున్న ఫోటోలు అప్పట్లోనూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.