ఐటీ దాడులతో ఆత్మహాత్య చేసుకుంటారా…? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఐటీ దాడుల సోదాలు, అరెస్ట్‌లు, కేసుల నేపథ్యంలో… ఆత్మహాత్య చేసుకొని ఉంటారని అంతా భావిస్తున్నారు. అయితే, దీనిపై పోలీస్ దర్యాప్తు పూర్తయితే కానీ ఓ అసలు నిజం బయటపడనుంది.
ఐటీ సోదాల సమయంలో… నాతోనే ఉన్నాడు. ఏమీ జరగదు… ఇలాంటివి రాజకీయాలలో సహాజమే. ఆందోళన చెందాల్సిన పనిలేదు… అంతా సర్దుకుంటుందని దైర్యం చెప్పా. కానీ ఇంతలో ఇలా చేసుకుంటాడు అనుకోలేదు అంటున్నారు ఆయన సన్నిహిత నేత, యజమాని.
అయితే… హైదరాబాద్‌లో ఐటీ సోదాలు జరుగుతున్నందున ఇదంతా మన రాష్ట్రంలో అనుకుంటే పొరపాటే. ఈ ఆత్మహాత్య కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర పీఏ రమేశ్ ఆత్మహాత్య చేసుకున్నాడు. రెండు,మూడు రోజుల పాటు మాజీ డిప్యూటీ సీఎం ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించి, కొన్ని విలువైన డాక్యుమెంట్లు… కొంత నగదును సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు. అయితే, ఐటీదాడుల తర్వాత పీఏ ఆత్మహత్య చేసుకోవటంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా… ఐటీ అధికారులు మాత్రం తమ లిస్ట్‌లో అసలు రమేష్ పేరే లేదంటున్నారు.
ఈ ఆత్మహత్య కర్ణాటకలో సంచలనం రేపగా… పోలీసులు మాత్రం దీనిపై లోతైన దర్యాప్తు చేపడతామంటున్నారు.