– కర్నాటక ఫైట్ లో కాంగ్రెస్ మ్యాజిక్ మార్క్ ను దాటేసింది. ప్రస్తుతం ఆ పార్టీ 117 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 113 స్థానాలే కీలకం. అయితే.. తమ ఎమ్మెల్యేలను రక్షించుకునే పనిలో హస్తం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
– ఎన్నికైన ఎమ్మెల్యేలను తమిళనాడుకు షిప్ట్ చేయాలన్న యోచనలో కాంగ్రెస్ వర్గాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ గేమ్ ప్లాన్ నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ఈ ఎత్తు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
– ప్లాన్ బీ కి సిద్ధమవుతున్న బీజేపీ
– జేడీఎస్ తో బీజేపీ మంతనాలు
– కలిసి పని చేద్దామని ప్రతిపాదన
– రేపు మధ్యాహ్నం సీఎల్పీ సమావేశం
– బెంగళూరుకు ఎమ్మెల్యేలు రావాలన్న కాంగ్రెస్
– ‘మా నాన్నే సీఎం. కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా మెజారిటీ సాధిస్తుంది. కాంగ్రెస్ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే నమ్మకం ఉంది. బీజేపీని అధికారం నుంచి దూరం చేయడానికి మేం ఏం చేయడానికైనా సిద్ధం. కర్ణాటక ప్రయోజనార్థం మా నాన్నే ముఖ్యమంత్రి అవ్వాలి’ – యతీంద్ర, సిద్ధరామయ్య కుమారుడు
– కర్ణాటక ఎన్నికల్లో భారీ ఆధిక్యంలో కాంగ్రెస్
– ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటిన హస్తం పార్టీ
– చెన్నపట్టణ స్థానంలో కుమారస్వామి వెనుకంజ
– వరుణ నియోజకవర్గంలో సిద్ధరామయ్య ఆధిక్యం
– కనకపురా స్థానంలో డి.కె.శివకుమార్ ఆధిక్యం
– చిత్తాపూర్ లో మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఆధిక్యం