హిందీ జాతీయ భాష కాదు అంటూ.. కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కౌంటర్ ఇవ్వడం మరింత హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా ఈ వివాదం కాస్తా కన్నడ నాట రాజకీయ రచ్చకు కారణమైంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, కుమారస్వామిలు అజయ్ దేవగన్‌పై విరుచుకుపడ్డారు. ఈ వివాదంలో కిచ్చా సుదీప్‌కు మద్ధతుగా ఇద్దరు మాజీ సీఎంలు దేవగన్ వైఖరిని తప్పుపట్టారు.
హిందీ ఎన్నడూ మన జాతీయ భాష కాదు అని, ఎన్నటికీ కాబోదని సిద్దరామయ్య ట్వీట్ చేశారు. దేశంలో ఉన్న భాషా భిన్నత్వాన్ని గౌరవించడం ప్రతి భారతీయుడి విధి అన్నారు. ప్రతి భాషకు సంపన్నమైన చరిత్ర ఉందని, దాని పట్ల గర్వపడాలన్నారు. తాను కన్నడీయునైనందుకు గర్వపడుతున్నట్లు మాజీ సీఎం సిద్దరామయ్య తెలిపారు.
Hindi was never & will never be our National Language.
It is the duty of every Indian to respect linguistic diversity of our Country.
Each language has its own rich history for its people to be proud of.
I am proud to be a Kannadiga!! https://t.co/SmT2gsfkgO
— Siddaramaiah (@siddaramaiah) April 27, 2022
బీజేపీ హిందీ జాతీయవాదానికి అజయ్ దేవగన్ ఓ ప్రచారకుడిగా మారారని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. హిందీ చలనచిత్ర పరిశ్రమను కన్నడ సినిమా దాటి వేస్తోందని దేవగన్ గ్రహించాలన్నారు. కన్నడ ప్రజల ప్రోత్సాహంతోనే హిందీ చిత్ర పరిశ్రమ వృద్ధి సాధించిందన్నారు. అజయ్ దేవగన్ నటించిన తొలి చిత్రం పూల్ ఔర్ కాంటే .. బెంగుళూరులో ఏడాది పాటు ప్రదర్శించారని కుమారస్వామి గుర్తు చేశారు.
Ajaya Devgan’s blabbered as a mouth piece of BJP’s Hindi Nationalism of one nation, one tax, one language & one government. 5/7
— H D Kumaraswamy (@hd_kumaraswamy) April 28, 2022
Advertisements
కన్నడ స్టార్ సుదీప్ కొన్ని రోజుల క్రితం ఓ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ‘కేజీఎఫ్-2’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ హిందీ ఎంత మాత్రం జాతీయ భాష కాదన్నారు. దీనిపై అజయ్ దేవగన్.. సుదీప్‌ను ట్యాగ్ చేస్తూ, హిందీ ఇకపై జాతీయ భాష కాకపోతే, తన మాతృభాష చిత్రాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారు.. అంటూ ట్విట్ చేశారు. ఇక ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
అయితే తన ట్వీట్‌ను తప్పుగా అర్ధం చేసుకున్నారని అజయ్‌దేవగన్‌కు జవాబిచ్చారు సుదీప్. హిందీ అంటే తనకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. ‘మీరు హిందీలో పెట్టిన ట్వీట్‌ను నేను చదవగలిగా. అదే నా సమాధానాల్ని కన్నడలో రాస్తే పరిస్థితి ఏంటి సర్? చదవగలరా.. అయినా మనమంతా భారతీయులమే కదా.. నేను రెచ్చగొట్టాలని చెప్పడం లేదు’ అంటూ సుదీప్ రిప్లై ఇచ్చారు.