మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరిహద్దు వివాదం మరింత రాజుకుంటోంది. కర్ణాటకలో మరాఠి మాట్లాడే ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఠాక్రే వ్యాఖ్యలను కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్ తీవ్రంగా ఖండించడంతో పాటు మరింత అగ్గిరాజేశారు.
ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని లక్ష్మణ్ కేంద్రాన్ని కోరారు. సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో ఉన్న కేసులో తమకే అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రానికి చెందిన చాలా మంది ముంబయి-కర్ణాటక ప్రాంతానికి చెందినవారని చెప్పిన లక్ష్మణ్…అందుకే ముంబై తమకు కూడా హక్కు ఉందని చెప్పారు. ముంబైని కూడా కర్ణాటకలో కలపాలని.. అప్పటిదాకా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని అభ్యర్థించారు.
కాగా, కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్ర కలపాలని.. తాజగా మరోసారి సీఎం ఠ్రాకే కామెంట్స్ చేవారు. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉండగానే.. కర్ణాటక ప్రభుత్వం బెల్గావి పేరు మార్చడాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్రం వెంటనే వివాదాస్పదంగా ఉన్న సరిహద్దు ప్రాంతాలను యూటీగా చేయాలని డిమాండ్ చేశారు.