కర్ణాటకలో కీలక నేతలు కరోనాబారినపడుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి యుడ్యూరప్ప ఈ వైరస్ బారినపడి చికిత్స పొందుతుండగా.. తాజాగా ఏకంగా ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రినే ఈ మహమ్మారి వెంటాడింది. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి బి. శ్రీరాములకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో ప్రకటించారు.
జ్వరంగా అనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకున్నానని.. ఫలితాల్లో పాజిటివ్‌గా వచ్చిందని శ్రీరాములు ట్విట్టర్‌లో వెల్లడించారు. కరోనా పరిస్థితిని పర్యవేక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించానని..ఈ క్రమంలో తనకు కరోనా సోకిందని ఆయన చెప్పారు. వైద్యుల సూచనమేరకు ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు. కొద్దిరోజులుగా తనను దగ్గరగా మెలిగినవారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ಕೊರೊನ ಚಿಕಿತ್ಸೆ ಪ್ರಾರಂಭವಾಗಿದ್ದು, ಸಾಮಾನ್ಯ ಪರೀಕ್ಷೆಗಳು ಮುಗಿದಿವೆ. ಸ್ವಲ್ಪ ಜ್ವರ ಮತ್ತು ಕೆಮ್ಮು ಇದ್ದು, ವೈದ್ಯರು ಭಯ ಪಡುವ ಅಗತ್ಯವಿಲ್ಲ ಎಂದಿದ್ದಾರೆ. ವೈದ್ಯರ ಸಲಹೆಯಂತೆ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ನೀಡಲಾಗುವ ಡಯಟ್ ಆಹಾರ ಸೇವಿಸಲಾಗುತ್ತಿದೆ.1/2
— B Sriramulu (@sriramulubjp) August 9, 2020