కర్ణాటకలో నాథురాం గాడ్సే రోడ్డు పేరుతో వెలిసిన సైన్ బోర్డు కలకలం రేపింది. ఉడిపి జిల్లాలో నూతనంగా నిర్మించిన రహదారికి నాథూరాం గాడ్సే పేరుతో సైన్ బోర్డు ఏర్పాటు చేశారు.
ఈ సైన్ బోర్డు విషయం గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో మహాత్మ గాంధీని చంపిన వ్యక్తి పేరుతో సైన్ బోర్డు ఏర్పాటు చేయడమేంటని మండిపడింది.
వెంటనే ఆ సైన్ బోర్డును అధికారులు తొలగించారు. అనంతరం దీనిపై స్థానిక పోలీసులకు పంచాయతీ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ బోర్డు ఎవరు ఏర్పాటు చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి వి. సునీల్ కుమార్ నియోజకవర్గమైన బోలో గ్రామపంచాయతీలో ఈ సైన్ బోర్డును ఏర్పాటు చేశారు.