కేరళను ఓవైపు కరోనా వైరస్ మరోవైపు నిఫా వైరస్ వణికిస్తున్నాయి. ప్రతి రోజు 20వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతూనే ఉండగా,నిఫా వైరస్ కూడా జనాన్ని భయపెడుతోంది.నిఫా తో ఇప్పటికే ఓ బాలుడు మృతి చెందగా మరో 70మంది ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారు.దీంతో పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం అప్రమత్తమైంది.
కేరళతో ఎక్కువగా సంబంధాలుండే దక్షిణ కన్నడ జిల్లా ప్రజలను అత్యవసరం అయితే తప్పకేరళ వెళ్లొద్దని కర్ణాటక సర్కార్ హెచ్చరించింది. అక్టోబర్ వరకు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించింది. అంతేకాదు అన్ని పాఠశాలలు, విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులను సస్పెండ్ చేసింది.జ్వరం, మారిన మానసిక స్థితి,తీవ్రమైన బలహీనత,తలనొప్పి,శ్వాసకోశ ఇబ్బంది,దగ్గు,వాంతులు,కండరాల నొప్పి, మూర్ఛ, విరేచనాలు వంటి లక్షణాలతో కేరళ నుంచి వచ్చే వారిని పర్యవేక్షించాలని కర్ణాటక సర్కార్ అధికారులను ఆదేశించింది. దీనిపై పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది.