కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యపై బీజేపీ స్టేట్ చీఫ్ నళిన్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య ఓ టెర్రరిస్ట్ అని, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దుర్భరంగా ఉందని అందుకే ఆయన అసందర్భంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలను హిట్లర్లు, తాలిబన్లు అంటూ సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ టెర్రరిస్ట్ అంటూ ఘాటుగా స్పందించింది.
సిద్దరామయ్య సీఎంగా ఉన్న సమయంలోనే కర్ణాటకలో భారీగా హత్యలు జరిగాయని, ఆయనదే అసలైన తాలిబన్ సంస్కృతి అంటూ నళిన్ కుమార్ మండిపడ్డారు.
సిద్దరామయ్య వ్యాఖ్యలపై సీఎం బొమ్మై కూడా స్పందించారు. కాంగ్రెస్ ది బానిసల భావజాలమని, తమది దేశభక్తి కలిగిన పార్టీ అంటూ వ్యాఖ్యానించారు.