బెంగళూరు కోరమంగళ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా దూసుకెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే స్పాట్ కు చేరుకున్నారు పోలీసులు.
నుజ్జునుజ్జయిన కారు నుంచి మృతదేహాలను బయటకు తీయడం చాలా కష్టమైంది. ఎట్టకేలకు బయటకు తీసి.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంగళ్ కన్వెన్షన్ హాల్ వద్ద అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు పోలీసులు.
మృతుల్లో తమిళనాడులోని హోసూరు డీఎంకే ఎమ్మెల్యే ప్రకాష్ కుమారుడు కరుణ సాగర్, కోడలు బిందు ఉన్నట్లు చెప్పారు. స్పాట్ లోనే ఆరుగురు చనిపోయారని.. ఒకరు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతిచెందారని వివరించారు పోలీసులు.