ప్రముఖ వ్యాపార కన్సల్టెన్సీ సంస్థ క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్ తన తాజా నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. రాబోయే రోజుల్లో వాతావరణ మార్పుల వల్ల పలు దేశాల్లో మౌలిక సౌకర్యాలకు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నివేదికలో పేర్కొంది.
2050 నాటికి వాతావరణ మార్పుల వల్ల మౌలిక సౌకర్యాలకు అత్యధిక ప్రమాదం వాటిల్లే 50 ప్రావిన్సుల్లో 80శాతం చైనా, అమెరికా, భారత్ లోనే ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో చైనా నుంచి 26, అమెరికాలోని5, భారత్ లోని తొమ్మిది ప్రావిన్సులు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.
భారత్‌లోని పంజాబ్, బిహార్, యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, కేరళ, అసోంలలో వాతావరణం వల్ల మౌలిక సౌకర్యాలకు అధిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్టు తెలిపింది. ఈ నివేదిక కోసం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 2600 ప్రాంతాల్లో సంస్థ పరిశీలనలు చేసింది.
2050 సంవత్సరానికి ఉప-సార్వభౌమాధికారం, ప్రాంతీయ ముప్పుల డేటా కావాలంటూ పెట్టుబడిదారుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఈ నివేదికను రూపొందించినట్టు సంస్థ చెప్పింది. అధిక నిర్మాణాలు ప్రాంతాల్లో వాటిల్లే నష్ట నిష్పత్తి ఆధారంగా అత్యంత హానీ కలిగే ప్రాంతాలకు ర్యాంకింగ్ ఇచ్చామని వివరించింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదంలో ఉన్న రాష్ట్రాలు/ప్రావిన్సుల జాబితాలో బిహార్ (22), ఉత్తరప్రదేశ్ (25), అసోం(28), రాజస్థాన్ (32), తమిళనాడు (36), మహారాష్ట్ర (38), గుజరాత్ (44), పంజాబ్ ( 48), కేరళ (50), మధ్యప్రదేశ్ (52), కర్ణాటక 65వ స్థానంలో నిలిచింది.