తమిళనట విజయ్ నటించిన బిగిల్ సినిమా 200కోట్ల మార్క్ ని ఆరు రోజుల్లో దాటేసి మరో మైల్స్టోన్ కి దగ్గరలో ఉంది. బిగిల్ కి పోటీగా రిలీజ్ అయిన ఖైదీ సినిమా టాక్ బాగానే తెచ్చుకున్నా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతోంది. కమర్షియల్ సినిమా కావడం, ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సిన ఎమోషన్స్ లేకపోవడంతో కోలీవుడ్ సినీ అభిమానులు బిగిల్ కే ఓటేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని రాబట్టడంలో సక్సస్ అయిన విజయ్, తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లనే రాబట్టాడు. ఇప్పటివరకూ విజిల్ సినిమా పది కోట్లు రాబట్టింది. భారీ కలెక్షన్స్ రాబట్టిన విజిల్ వసూళ్లు రోజురోజుకి డ్రాప్ అవుతూనే ఉన్నాయి.
అయితే ఖైదీ కారణంగా బిగిల్ కి తెలుగులో నష్టం తప్పదు అనే మాట మొదటినుంచి వినిపిస్తూనే ఉంది. దీన్ని నిజం చేస్తూ ఖైదీ సినిమా తెలుగులో హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటిరోజు 30 లక్షలు మాత్రమే రాబట్టిన ఖైదీ వారం తిరిగేసరికి అయిదు కోట్లు రాబట్టింది. 30లక్షలకి 5కోట్లకి అసలు పొంతనే లేదంటూ ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. కేవలం మౌత్ టాక్ కారణంగానే కొత్తదనానికి ఓటేసిన తెలుగు ప్రేక్షకులు ఖైదీకి ఊహించని రిజల్ట్ ని అందించారు.