'ఖైదీ' కార్తికి కాలం కలిసొచ్చింది - Tolivelugu

‘ఖైదీ’ కార్తికి కాలం కలిసొచ్చింది

Karthi Khaidi Closing Collections, ‘ఖైదీ’ కార్తికి కాలం కలిసొచ్చింది

వరుస ప్లాఫ్ లతో తీవ్ర నిరాశకు గురవుతున్న సమయంలో కార్తికి కాలం కలిసొచ్చింది. ఖైదీ సినిమా ఆయనకు మంచి అవకాశాన్నిచ్చింది.ఖైదీ రిలీజ్ సమయానికి అసలు ఈ సినిమా మీద పెద్ద ఆశలు లేవు. ఓపెనింగ్స్ కూడ అంతంత మాత్రంగానే ఉన్నవి. మరో పక్క విజయ్ సినిమా మాస్ హిట్ అనిపించుకంటుంది. కార్తికి మరో ప్లాఫ్‌ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరగుతుంది. సరిగ్గా అప్పుడే మ్యాట్నీ సినిమా నుంచి ప్రేక్షకులు పెరగడం మొదలైంది. ఫస్ట్ షో, సెకండ్ షో టైమ్ కు సినిమా హిట్ అనే ప్రచారం మొదలైంది. అన్ని చోట్ల కలెక్షన్ల వర్షం కురిసింది.రొటీన్ కు భిన్నంగా కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూస్తారని మరోసారి రుజువైంది.

ఇప్పటి వరకున్న సమాచారం మేరకు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా 7.5 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది.సినిమాను మూడున్నర కోట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్లకు లాభాలే వచ్చాయి. ఈ సినిమాతో పాటే రిలీజైన బిగిల్ సినిమాను చాలా చోట్ల తీసేస్తే ఆ థియేటర్స్ లో ఖైదీ సినిమా వేశారు. అయితే ఇది చూసి మొదట సినిమా తీసుకోవడానికి నిరాకరించిన వాళ్లు ఇప్పుడు కుమిలిపోతున్నారట. తాము కార్తి ట్రాక్ రికార్డ్ చూసి సినిమాను వదులుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను పొందిన ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ లాభాలు గడించి చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాకు ముందు ఆయన ‘కల్కి’, ‘బందోబస్తు’ ‘ఎన్జీకే’ సినిమాల రిలీజ్ రైట్స్ కొనుక్కొని నష్టపోయారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp