రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల, కొంగర్ ఖుర్ద్ ల్యాండ్ ఇష్యూపై మంత్రి తనయుడు కార్తిక్ రెడ్డి స్పందించారు. మొత్తం 58 ఎకరాల వివాదాస్పద భూమితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అసలు ఆ భూమి ఎక్కడ ఉందో కూడా తనకు తెలియదన్నారు.
గత వారం రోజులుగా సోషల్ మీడియాలో నిరాధారమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక బీజేపీ నాయకులపైనా ఫైరయ్యారు కార్తిక్ రెడ్డి. ఆసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు.
బీజేపీ నాయకులు కలెక్టర్ దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకుని మాట్లాడాలన్నారు. డైరెక్ట్ గా ఒవైసీ, కార్తిక్ రెడ్డి కబ్జా చేస్తున్నారని ఎలా మాట్లాడుతారని బీజేపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి రంగారెడ్డి జిల్లాపై కన్నేసినట్లు కూడా అసత్య ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు.
తమకు 49 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందన్నారు. 15 ఏళ్ల నుంచి తమపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారని.. ఇలాంటివి తమకు కొత్త కాదని తెలిపారు. నిజానిజాలు బయటికి వస్తాయన్న కార్తిక్ రెడ్డి.. అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.