కార్తీక దీపం ఈ పేరు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో ప్రస్తుతం నడుస్తున్న టాప్ సీరియల్ గా కార్తీక దీపం ఓ వెలుగు వెలుగుతుంది. ఇప్పటికే 650 ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్ కీలక దశకు చేరుకుంది. తెలుగు రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షో ని సైతం వెనక్కి నెట్టి రేటింగ్ లో దూసుకెళ్లింది.
ఈ సీరియల్ తాజాగా దేశ వ్యాప్తంగా వివిధ చానెల్స్ లో ప్రసారం అవుతున్న ఫిక్షన్ తరహా కార్యక్రమాల్లో కార్తీక దీపం సీరియల్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం స్టార్ మా స్టార్ ప్లస్ లాంటి ఛానల్స్ ని సైతం క్రాస్ చేసుకుని రేటింగ్ లో ముందుకు వెళ్ళటానికి బిగ్ బాస్ లాంటి షో కారణమంటూ చెప్తున్న యాజమాన్యానికి నెటిజన్లు షాక్ ఇస్తున్నారు. స్టార్ మా కు ఇంత రేటింగ్ రావటానికి కారణం కార్తీక దీపం సీరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వంటలక్క తెలుగు రాష్ట్రాల్లో తన మార్కు నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.