ఆర్ఎక్స్100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు కార్తికేయ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో కార్తికేయ కు మంచి పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత గుణ 369, హిప్పి, 90 ఎమ్ ఎల్ సినిమాలను కార్తికేయ చేశాడు. కానీ ఈ సినిమాలు అనుకున్న స్థాయిలో హిట్ ను అందించలేకపోయాయి. ప్రస్తుతం చావు కబురు చల్లగా అనే సినిమా చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రో సాంగ్ రిలీజ్ అయింది. మై నేమ్ ఈజ్ రాజు అంటూ సాగే ఈ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో బస్తి బాలరాజు గా కార్తికేయ శవాలను స్మశానానికి తీసుకు వెళ్లే డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. కార్తికేయ సరసన సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.