గుమ్మకొండ కార్తికేయ ప్రస్తుతం చావు కబురు చల్లగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కౌశిక్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కార్తికేయ సరసన లావణ్య త్రిపాటి నటిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఇందులో కార్తికేయ పక్కా మాస్ లుక్ లో కనిపించారు.
లావణ్య త్రిపాటి నర్స్ పాత్రలో నటిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. కార్తికేయ మార్చరీ వ్యాన్ డ్రైవర్ గా కనిపించాడు. గీత ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీవాసు ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఆర్ఎక్స్ 100 సినిమా తో కార్తికేయ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించి పెట్టింది.