నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కార్తికేయ. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. అయితే ప్రస్తుతం ఈ సీక్వెల్ గా కార్తికేయ2 సినిమా చేస్తున్నాడు నిఖిల్. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమాలో స్వాతి హీరోయిన్ గా నటించారు.
కాగా ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. జీ స్టూడియోస్ వారు కార్తికేయ 2 శాటిలైట్, డిజిటల్ హక్కులను అన్ని భాషలకు కలిపి 16.50 కోట్లకు కొనుగోలు చేశారట. ఇది మంచి సక్సెస్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.
టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను మే లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఈ సినిమాతో పాటు నిఖిల్ 18 పేజెస్ సినిమా చేస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.