ఎన్నికల వేళ.. తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆ రాష్ట్రానికి చెందిన పబ్లిక్ ఫిగర్లు చాలా మంది తమ పాపులారిటీని పాలిటిక్స్‌లో ఉపయోగించుకోవాలని తెగతాపత్రయపడుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ ఓ పార్టీని పెట్టగా.. ఈ నెలాఖరుకు రజనీకాంత్ కూడా పార్టీ అనౌన్స్‌మెంట్ చేయనున్నారు. కాగా జనవరిలో మరో పార్టీ కూడా రాబోతోంది.
మాజీ సీఎం కరుణానిధి మరో కుమారుడు అళగిరి పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. జనవరి 3న తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై.. కొత్త పార్టీ స్థాపనపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అయితే డీఎంకేకు మాత్రం మద్దతిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. స్టాలిన్‌తో విబేధాల కారణంగా అళగిరి డీఎంకే నుంచి బయటకు వచ్చారు.