జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అహంకారం పతాక స్థాయికి చేరింది. పార్టీలుగా సిద్దాంత పరంగా విమర్శించుకోవడం సర్వ సాధారణం. వ్యక్తులుగా,కులాలుగా, మతాలుగా తిట్టుకోవడం బలహీనుల లక్షణం.
కేటీఆర్ ఓ సమావేశంలో ఎవడో చారో బొంగు గాడో అని అనడం కులాల పట్ల ఆయన చిన్న చూపు తెలియజేస్తుంది. ఈ దేశంలో వృత్తులు ఎంతో గౌరవాన్ని పొందాయి. ఆ వృత్తి ఆధారంగా చేసుకొని కులాల ఉనికి వచ్చింది. ఏ వృత్తి లేని వారి కంటే వృత్తి ఉన్నవారినే ప్రాచీన సమాజం ఎంతో ఆదరించింది.
చరిత్ర లేని, తెలియని వారే చిల్లరగా ఇతరులను కించపరుస్తూ, వికృతానందం పొందుతారు. ఈ రోజు కల్వకుంట్ల కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే “నీవు హేళన చేసిన కులవ్యక్తి శ్రీకాంతాచారి బలిదానం వల్లే. నీ ఈ ధోరణి టీఆర్ ఎస్ పతనానికి సంకేతం.
వాస్తవానికి అగ్ర, నిమ్న అనే కుల భావన ప్రాచీన కాలంలో లేదు.ఉత్పత్తి కులాలపై ఆధిపత్యం సాధించడం కోసం కొన్ని పని పాట లేని సామాజిక వర్గాల సృష్టే ఈ కుల వివక్ష. తెలంగాణ పోరాటమే సామాజిక అస్థిత్వ సంఘర్షణ అని, అది మరిచి కేటీఆర్ మాట్లాడటం దురహంకారానికి సంకేతం.
వెంటనే ఆ సామాజిక కులాలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.