వందేళ్ల తర్వాత అత్యంత భారీ వర్షాలు హైదరాబాద్ మహనగరాన్ని వరదలతో వణికిస్తున్నాయి. భారీ వర్షం, వరద హైదరాబాద్ ను ముంచెత్తడం చూస్తే మనసు చలిస్తోందని యుఎస్ కాన్సూల్ జనరల్ కేథరిన్ హడ్డా ట్విట్ చేశారు. స్నేహితులారా సురక్షితంగా ఉండండి..అంటూ ట్వీట్టర్లో సందేశం ఇచ్చారు.
హైదరాబాద్ నగరంలో 111 ఏళ్లలో సెప్టెంబర్ మాసంలో గంట సేపు కుండపోతగా భారీ వర్షం కురియడంతో రహదారులన్నీ వరద కాల్వలుగా మారాయి. వాగులు, వంకలుగా తయారైన వీధుల్లో వాహనాలు మొరాయించాయి. 1908 సెప్టెంబర్ లో ఇలాంటి వర్షం కురిసిందని అధికార వర్గాలు తెలిపాయి. చెరువులు, నాలాలు పొంగాయి. పలు కాలనీలు, బస్తీల్లో ఇళ్లు నీటమునిగాయి. కిలోమీటర్ల మేర రాత్రి వాహనాలు నిలిచిపోయాయి.