కృష్ణ విజయ్ దర్శకత్వం లో శ్రీవిష్ణు హీరో గా నటించిన సినిమా తిప్పరా మీసం. తెలుగులో వైవిధ్యభరితమైన సినిమాలు చెయ్యటంలో శ్రీవిష్ణు ఎప్పుడు ముందుంటాడు. సినిమా మొదటి నుంచి కూడా ఫస్ట్ లుక్ కానీ, ట్రైలర్ కానీ అన్ని అలాగే అనిపించాయి. అయితే అదే ఆలోచన తో థియేటర్ లోకి వెళ్లిన ప్రేక్షకులకు సినిమా వైవిధ్యభరితంగానే కనిపిస్తుంది. మదర్ సెంటిమెంట్ తో వచ్చిన శ్రీవిష్ణు యాక్టింగ్ అందరిని ఆకట్టుకుంటుంది. కథలో శ్రీవిష్ణు క్యారెక్టర్ ని చూపించే సరికే ఫస్ట్ ఆఫ్ అయిపోవడంతో ప్రేక్షకులకు కొంత బోర్ అనిపిస్తుంది. తరువాత సెకండ్ ఆఫ్ లో అలాగే ఉన్నప్పటికీ ఆఖరు ఇరవైనిమిషాలు శ్రీవిష్ణు యాక్టింగ్ అందరిని ఆకట్టుకుంటుంది. శ్రీవిష్ణు తల్లి పాత్ర చేసిన రోహిణి నటన కూడా అందరిని ఆకట్టుకుంది.
ముఖ్యంగా హీరోయిన్ యాక్టింగ్, ఆమె ఎక్స్‌ప్రేషన్స్‌లో ఎలాంటి వేరియేషన్ లేదు. హీరోయిన్ సినిమాకు మైనస్‌గా చెప్పుకోవచ్చు. ఇక సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయిన శ్రీవిష్ణు నటన మాత్రం తన కెరీర్ లో బెస్ట్ అని చెప్పాలి.