పవన్‌ని దిగ్గొట్టి ఎగ్గొట్టిన కత్తి

పవన్ కళ్యాణ్ పైనా అతని ఫ్యాన్స్ పైనా కొంతకాలంగా విమర్శలు చేస్తూ లైమ్ లైట్ లోకి వచ్చిన సినీ విమర్శకుడు కత్తిమహేష్ మళ్లీ కత్తికట్టారు. మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీసు.. నివాసానికి శంకుస్థాపన చేసిన పవన్ మీద కత్తి విమర్శలు గుప్పించారు. జనసేన ఆరంభంలోనే బానిసత్వం, పంథాలో జీహుజురి, పునాదిలో అవినీతి అంటూ విమర్శలు చేశారు.

అయితే, గంటన్నర తర్వాత చేసిన మరో ట్వీట్ లో మాదాసు, రాఘవయ్య వంటి వార్కి జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లు ఇవ్వడంపై కత్తి పవన్ కు అభినందనలంటూ చెప్పుకొచ్చారు. కత్తి వ్యాఖ్యలకు పవన్ అభిమానులు కామెంట్లరూపంలో విరుచుకుపడుతుంటే, మరికొన్ని వ్యాఖ్యల్లో పాజిటివ్‌నెస్.. మిక్స్‌డ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. కత్తి మొత్తంగా ఏమన్నారో ఆయన మాటల్లోనే..