‘కత్తి మహేష్ తలుపులు మూసి ఎగబడ్డాడు’

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత.. ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. మహేష్ తనను గదిలోకి రమ్మని పిలిచి,  తనపై భౌతికదాడికి పాల్పడ్డాడని, తలుపు మూసి బలవంతం చేయబోయాడని సునీత ఆరోపించింది. ఆమె ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు కత్తి మహేష్ పక్కనే వున్నాడు. ప్రముఖ టీవీ ఛానెల్ డిబేట్‌లో జరిగిన ఈ తతంగం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్‌పై జరిగిన చర్చకు యధాలాపంగా ఒకేసారి వీళ్లిద్దరూ అటెండయ్యారు.

అందరికీ న్యాయం చెప్పే కత్తి మహేష్… నా విషయంలో ఏం చేస్తారంటూ సునీత సూటిగా ప్రశ్నించింది. తనపై అటెమ్ట్ టు రేప్ ఎలిగేషన్స్ చేస్తున్న సునీత, పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులో చేసుకోవచ్చని, ఎదుర్కొనడానికి తాను సిద్ధంగావున్నానని అక్కడికక్కడే గట్టిగా వాదించాడు కత్తి. మొత్తానికి.. శకునం చెప్పే బల్లి కుడితిలోపడ్డట్టయ్యింది కత్తి మహేష్ పరిస్థితి.