సందీప్ కిషన్, హన్సిక హీరో, హీరోయిన్ లుగా ఇటీవల విడుదలైన సినిమా తెనాలి రామకృష్ణ ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేసింది. ట్రైలర్, టైటిల్ చూసి ఇదేదో కామెడీ సినిమా కదా…కాసింత నవ్వుకోవచ్చనుకున్న ప్రేక్షకుడికి ఈ సినిమా ఆసాంతం అసహనానికి గురి చేసింది. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం చెత్తగా ఉంది. కథ, కథనం పాత చింతకాయ పచ్చడిలా ఉంది. హాస్యం చూపించబోయి అపహాస్యం పాలయ్యారు. 80,90 ల కథను చూపించి ప్రేక్షకులకు చిరాకు తెప్పించారు. సెకండాఫ్ అయినా కాస్త ఆసక్తికరంగా ఉంటుందేమో అనుకుంటే అదీ లేదు.
చెట్టుకింద ప్లీడర్ కోర్టు హాల్ లో కేసును బాగా డీల్ చేస్తాడనుకున్న ప్రేక్షకుడికి నిరాశే మిగిలింది. అన్నీ మజిల్ పవర్ తోనే సాధించే వాడికి లాయర్ రోల్ ఎందుకిచ్చారో అర్ధం కాలేదు. ఇక సందీప్ కిషన్ గురించి చెప్పాలంటే సందీప్ కిషన్ తాను నటుడిననే విషయం మర్చిపోయాడేమో అనిపిస్తుంది. వచ్చిన డైలాగ్ లను అప్పజెప్పడం తప్ప తాను నటించినట్టుగా కనిపించలేదు.
ఇక హీరోయిన్ హన్సిక కంట్రిబ్యూషన్ పెద్దగా లేదనే చెప్పాలి. వెన్నెలకృష్ణ పాత్ర మెచ్చుకోదగ్గదే. జడ్జీగా పోసాని కృష్ణ మురళి బాగా నటించారు. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఓ బలమైన పాత్రలో నటించారు. సాంకేతికపరంగా చూస్తే..సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఫర్వా లేదనిపించింది. కానీ సాయి కార్తీక్ సంగీతం మాత్రం చిరాకు తెప్పించింది.
మొత్తం మీ ట్రైలర్, టైటిల్ చూసి కామెడీ సినిమా అనుకుంటే పొరబడినట్లే.