కాట్రగడ్డ ప్రసూన, టీడీపీ నేత
సికింద్రాబాద్ బోయగూడ అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవ దహనం బాధాకరం. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. బతుకు దెరువు కోసం బీహార్ నుంచి నగరానికి వలస వచ్చిన కూలీలు ఈ దుర్ఘటనలో మృత్యువు బారిన పడటం అత్యంత దురదృష్టకరం.
మృతుల కుటుంబాలకు నా తరఫున, తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల నష్ట పరిహారం సరిపోదు. భాదితులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షలు ఇవ్వాలి.
భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఇటువంటి డిపోలపై ఫోకస్ పెట్టాలి.
తక్షణమే ఇలాంటి గోడౌన్స్ ను గుర్తించాలి. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించే వాటిపైన చర్యలు తీసుకోవాలి.