కాట్రగడ్డ ప్రసూన, తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలు
నల్గొండ జిల్లా ముషంపల్లిలో 54 ఏళ్ల మహిళపై జరిగిన హత్యాచార ఘటనను ఖండిస్తున్నాం. రోజూ మీడియా ముందుకొచ్చి మహిళలపై ఘోరాలు పెరిగిపోతున్నాయని చెబుతున్నా.. ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రలోనే ఉంటోంది. తెలంగాణ హోంమంత్రికి ఇంతటి దారుణమైన ఘటనలు కనిపిస్తున్నాయా..? అసలు రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉందా..? లేదా..? మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టలేని హోంమంత్రి, మహిళా కమిషన్ ఉంటే ఎంత.. లేకపోతే ఎంత.
వయసుతో సంబంధం లేకుండా మానవ మృగాలు ఆడవారు అయితే చాలు అత్యాచారాలు, హత్యలు చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. దీనికి కారణం ప్రభుత్వం ఏం చేయలేదనే ధీమా. అఘాయిత్యాల పాలవుతున్న మహిళలు, చిన్నారులు సామాన్యులు కాబట్టే కేసీఆర్ సర్కార్ కు పట్టడం లేదా..? వారి కుటుంబ సభ్యులకు ఇటువంటి ఘటనలు జరిగితే తప్ప ప్రభుత్వంలోని పెద్దల్లో చలనం వచ్చేలా లేదు. ఇటువంటి ఘోరాలు పునరావృతం కాకుండా సర్కార్ తక్షణమే కఠినమైన చట్టాలు తీసుకురావాలి.