అమెరికా టూర్ వెళ్లిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ జంట విహారయాత్రలో బిజీ అయ్యారు. న్యూయార్క్ నగరంలోని ప్రియాంకా చోప్రాకు చెందిన రెస్టారెంట్ కు వెళ్లింది ఈ బాలీవుడ్ జంట.
ప్రియాంక చోప్రాకు చెందిన రెస్టారెంట్ ను విజిట్ చేసిన తర్వాత.. కత్రినా కైఫ్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ ఫోటోను పోస్టు చేసింది. ఇంటికి దూరంగా మరో ఇల్లు లాంటి ప్రదేశానికి చేరుకున్నానని తన ఫోటోకు ట్యాగ్ చేస్తూ పోస్తు చేసింది.
కత్రినా పెట్టిన క్యాప్షన్ కు ప్రియాంకా కూడా స్పందించింది. సోనా రెస్టారెంట్ మీకెప్పటికీ స్వాగతం పలుకుతుందని ఆ పోస్టులో ప్రియాంకా వెల్లడించింది. అయితే.. ఇప్పుడా పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా.. సోనా పేరుతో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా.. న్యూయార్క్ లో ఓ రెస్టారెంట్ ను ఓపెన్ చేసింది. గత ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ల జంట హనీమూన్ లో భాగంగా న్యూయార్క్ లోని సోనా రెస్టారెంట్ లో గడిపారు.