ఫిట్‌నెస్ విషయంలో సెలబ్రిటీలు అందరూ ఎప్పుడూ ముందే ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వారు ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. జిమ్‌లకు వెళ్లి 6 తరబడి సాధన చేయడం, ఇతర వ్యాయామాలు, యోగా చేయడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించడం వంటివి చేస్తుంటారు. అయితే బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఈ విషయంలో ఇంకా ముందే ఉంటుందని చెప్పవచ్చు.
కత్రినా కైఫ్ తాజాగా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న ఓ వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. ఇన్‌స్ట్రక్టర్ యాస్మిన్ కరాచివాలా కత్రినాతో పైలేట్స్ మెషిన్‌పై వర్కవుట్లు చేయిస్తోంది. అయితే పైలేట్స్ మెషిన్ నచ్చేది కాదని, కానీ కత్రినా 15 ఏళ్ల తరువాత ఎట్టకేలకు ఆ మెషిన్‌పై వర్కవుట్లు చేస్తుందని ఇన్‌స్ట్రక్టర్ యాస్మిన్ తెలిపింది. కత్రినాకు చెందిన ఆ వీడియోను ముందుగా యాస్మిన్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయగా.. దాన్ని కత్రినా కూడా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో యాస్మిన్ పెట్టిన కామెంట్‌ను కత్రినా లైక్ చేసింది.
కాగా కత్రినా కైఫ్ ప్రస్తుతం సూర్యవంశి అనే సినిమా చేస్తోంది. ఈ మూవీకి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఫోన్ భూత్ అనే మరో మూవీలోనూ కత్రినా నటిస్తోంది. అందులో ఇషాన్ ఖట్టర్, సిద్ధార్థ్ చతుర్వేదిలు నటిస్తున్నారు.