తప్పుగా ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోవద్దు! మొన్న కత్రినా కైఫ్ IIFA అవార్డు ఫంక్షన్ కి ముందు జరిగే IIFA Rocks కార్యక్రమం లో తళుక్కున మెరిసింది. ముదురు మందారం రంగు బ్యాక్-లెస్ చమ్కీ డ్రెస్ వేసుకొని అందరిని కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేసింది.
ఆ డ్రెస్ వల్ల కత్రినాకి అందం వచ్చిందా, లేక కత్రినా వల్ల డ్రెస్ అదిరిపోయేలా వుందా అన్న విషయం ఇంకా ఎవ్వరు తేల్చుకోలేకపోతున్నారు. ఆ విషయం పక్కన పెడితే, ఆ కొద్ది గంటలూ వేసుకున్న డ్రెస్ ఖరీదు విని మనలాంటి సామాన్య జనం మూర్ఛపోవాల్సిందే. ఎందుకంటే, ఆ డ్రెస్ కొనాలంటే అయ్యే ఖర్చు అక్షరాలా ఎనిమిది లక్షల ముప్పయి అయిదు వేల రూపాయిలు! జూలియన్ మేక్ డోనాల్డ్ అనే ఒక బ్రిటిష్ డిజైనర్ మొన్న ఆగస్ట్ స్ప్రింగ్ కలెక్షన్‌లో ఈ డ్రెస్‌ని తయారు చేశారు. అప్పుడు ఆ డ్రెస్‌ని పెద్దగా పట్టించుకోకపోయినా, మొన్న కత్రినా వేసుకున్నాక బాగా పాపులర్ అయ్యిందట. కొనేవాళ్ళు ఎవరో తెలియదు కానీ, ప్రస్తుతానికి అందరూ దాని గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. దాదాపు తొమ్మిది లక్షలంటే ఒక మధ్య తరగతి వాళ్లకి పదేళ్ల సంపాదన…అంత ఖర్చు ఒక్క రాత్రి ఫంక్షన్‌లో వేసుకొనే డ్రెస్ కోసం ఖర్చు చేసిందా అని ఆశ్చర్య పోతున్నారు. కానీ చాలా సార్లు, డిజైనేర్లే తమ డ్రెస్ పాపులర్ కావడానికి ఇలాంటి అవార్డు ఫంక్షన్ల కోసం హాట్ హీరోయిన్లకు ఇస్తుంటారు.