బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఫ్యాషన్ సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో అమ్మడు తలుక్కుమంది. ఆకుపచ్చ రంగు దుస్తుల్లో కనిపించి కుర్రాళ్లకు మత్తెక్కించింది.
కార్యక్రమంలో గ్రీన్ కలర్ డ్రెస్ లో అమ్మడు చాలా అందంగా కనిపించింది. ఆమె అందాలను అక్కడున్న ఫోటో గ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఫోటోలపై అభిమానులు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. కొందరేమో ప్రెట్టియెస్ట్ హీరోయిన్ అంటూ కామెంట్స్ చేస్తుండగా మరికొందరేమో మిలీనియల్ సూపర్ స్టార్ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి ప్రపంచంలో అందమైన మహిళ అంటూ బిరుదులిచ్చేస్తున్నారు.
మరోవైపు కత్రినా తదుపరి చిత్రం ఫోన్ భూత్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా… సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు