కత్రినా కైఫ్ ఈ పేరు తెలియని వారుండరు.తెలుగులో చేసింది రెండే సినిమాలు అయినప్పటికీ కత్రినా గ్లామర్ కు తెలుగు కుర్రకారు ఈ భామను అంత తొందరగా ఎలా మర్చిపోతారు. తెలుగులో మొదట విక్టరీ వెంకటేష్ తో మల్లీశ్వరి సినిమా చేసింది. ఈ మూవీలో నటనతో ఆదరగొట్టి నటనపరంగా కత్రినా ఫుల్ మార్కులు ఖాతాలో వేసుకుంది. అలాగే మల్లీశ్వరి సినిమా హిట్ కూడా అవ్వడంతో ఈ భామకు తెలుగులో బాలయ్య సరసన నటించే ఛాన్స్ దక్కింది. అల్లరి పిడుగులో బాలక్రిష్ణకు జోడీగా కత్రినా యాక్ట్ చేసింది కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తెలిపోవడంతో టాలీవుడ్ లో కత్రినాకు అవకాశాలు సన్నగిల్లాయి. ఈ భామ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తోన్న సూర్యవంశీలో కీలకపాత్ర చేస్తోంది.
ఇదిలా ఉండగా…కరోనా ధాటికి సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయాయి.దీంతో హీరో, హీరోయిన్స్ అంత ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక ఇంట్లోనే హాయిగా సేదా తిరుతూ పిల్లలతో ఉన్న సమయాన్ని గడుపుతు కాలక్షేపం చేస్తున్నారు. అయితే కత్రినా కైఫ్ మాత్రం తాను తిన్న గిన్నెలను తోముతూ అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలలో పోస్ట్ చేసింది. కత్రినా కైఫ్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.