బాలీవుడ్ ముద్దు గుమ్మల్లో పొడవు కాళ్ళ సుందరి కత్రినా కైఫ్ ఒకరు. ఈ మధ్య కత్రినా తరుచూ అభిమానులను అలరిస్తూనే ఉంది. తాజాగా కత్రినా జోధ్ పూర్ లో జరిగిన ఓ వివాహ వేడుకలో మెరిసింది.
ఆ చిత్రాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. కత్రినా సినీ పరిశ్రమకి వచ్చి 19 సంవత్సరాలు గడిచిపోయాయి. కత్రినా బ్రిటిష్ మూలాలు ఉన్న యువతి అయినప్పటికీ భారత దేశ సంప్రదాయాలను చక్కగా పాటిస్తుంటుంది.
దాని వల్ల ఆమెను అభిమానులు ఎక్కువగా అభిమానిస్తుంటారు. కెరీర్ ప్రారంభంలో ఆమె ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొంది. ఆదివారం నాడు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన కత్రినా కైఫ్ కనిపించింది. కత్రినా కైఫ్ తక్కువ మేకప్‌తో బూడిద-వెండి చీరను ధరించి మెరిసింది.
ఈ వివాహ వేడుకలో ఫ్యాషన్ డిజైనర్ పంకజ్ జోహార్‌తో కలిసి ఫోటో దిగింది. ఈ వేడుక కంటే ముందు కత్రినా ఆదివారం తెల్లవారుజామున ముంబై విమానాశ్రయంలో కనిపించింది. ఆమె ముదురు గులాబీ రంగు సూట్ ధరించి కనిపించింది.
Glimpses of unforgettable and mesmerising wedding of #anchit at #jodhpur ..#nykaa #falguni nayyar #KatrinaKaif #mumbaimetro pic.twitter.com/9AscqTDmN8
— Pankaj Johar (@panksjohar) November 27, 2022