విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జంట శుక్రవారం వివాహ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో పాటు తన వివాహ ఫోటోలను, ఓ వీడియోను ఆమె అభిమానులకు షేర్ చేశారు.
ఆ వీడియో విక్కీ కౌశల్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. బ్యాక్ గ్రౌండ్‌లో కత్రినా నవ్వులు కూడా వీడియోలో వినిపిస్తున్నాయి. దీంతో ఫోటోను ఆమె షేర్ చేసింది. అందులో కత్రినా కైఫ్ నవ్వుతుండగా, విక్కీ ఆమె వైపే చూస్తూ కనిపిస్తున్నాడు.
విక్కీని కత్రినా తన ఆశా కిరణంగా పోస్టులో పేర్కొంది. హ్యాపీ వన్ ఇయర్ అంటూ సూర్యడి ఎమోజిని కూడా కత్రినా పెట్టింది. మరోవైపు విక్కీ కౌశల్ కూడా వారి వివాహ, వెకేషన్‌లో ఎంజాయ్ చేసినప్పటి ఫోటోలోను షేర్ చేశాడు. కత్రినాను విక్కీ మై లవ్ అంటూ క్యాప్షన్ పెట్టాడు.
వీరి వివాహసందర్భంగా సెలబ్రిటీలు విషెస్ తెలిపారు. కత్రినా కైప్ మామ..స్టంట్ మాస్టర్ శ్యామ్ కౌశల్, అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్, ఇలియానాలు వారికి శుభాకాంక్షలు తెలిపారు. కత్రినా, విక్కీలు గతేడాది డిసెంబర్ 9న కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకన్నారు.