బాలీవుడ్ పొడుగు కళ్ల సుందరి కత్రినా కైఫ్ ఈ మధ్య చాలా బిజీగా కాలం గడుపుతోంది. ఓ పక్క వైవాహిక జీవితాన్ని ఆనందిస్తూనే ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతోంది. తాజాగా ఆమె ఓ ఫోన్ ప్రమోషన్ కోసం ఆమె బిజీగా ఉంది.
అందుకోసం ఆమె ధరించిన నైట్ డ్రెస్ ఫోటోలు నెట్టింట్లో హాల్ చల్ చేస్తున్నాయి. ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ నలుపు రంగులతో కూడిన ఈ డ్రెస్ లో కత్రినా మెరిసే నక్షత్రంలా ఉంది. ఈ దుస్తులను అమీ పటేల్ రూపొందించారు.
దీని కోసం ఆలిస్ ప్లస్ ఒలివియాను ఎంచుకున్నారు. ఇందులో బ్రీన్ స్లిమ్ కట్, లాంగ్ ఫిట్డ్ లతో పాటు సింగిల్ బ్రెస్ట్ బ్లేజర్ తో షోల్టర్ ప్యాడ్ లు, లాపెల్స్, పాకెట్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం కత్రినా ధరించిన దుస్తుల ఖరీదు రూ.45, 344 గా బ్లేజర్ ఖరీదు ఉంటే… రూ.27,203 ఎత్తైన ఒలివియా బూట్‌కట్ ప్యాంటు జత చేయడం జరిగింది.
జిమ్మీ చూ నుండి ఏకరీతిగా కనిపించడానికి న్యూడ్ టోన్డ్ పంప్ లను ధరించింది. బంగారపు చెవిపోగులను ధరించింది. మేకప్ కూడా తగినంత వేసుకోవడంతో కత్రినా మరింత అందంగా ఉంది.