తొలివెలుగుకు ప్రత్యేకం.
గాంధీజయంతి రోజున రిలీజ్ అయిన సైరా నరసింహారెడ్డి చూడదగ్గ సినిమా. స్వాతంత్రోద్యమ భావాలతో ఉండే రోజున ‘సైరా’ సినిమా మరింత దేశభక్తిని పెంచుతుంది. చిరంజీవి నటన సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లగా, గురువుగా అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి యాక్టింగ్ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. ఫస్ట్ ఆఫ్‌లో సినిమా సాగదీత, అనవసర ప్రేమ సీన్లు కాస్త ఇబ్బంది అనిపిస్తాయి. కానీ ఇంటర్వెల్‌కు ముందు సీన్ అధ్బుతంగా ఉంటుంది.
ఇక సెకండ్ ఆఫ్‌లోనూ సాగదీత అనిపిస్తుంది. 170 నిమిషాల నిడివి అనేది కొంచెం ఎక్కువే. సినిమా నిడివి ప్రతి ఒక్కరికి కాస్త చికాకు పెట్టించినా, క్లైమాక్స్ సీన్ అద్భుతంగా ఉంటుంది. సినిమా చూసి బయటకు వచ్చేవారు ఖచ్చితంగా దేశభక్తి నింపుకునే బయటకు వస్తారు అనటంలో ఎలాంటి సందేహాం లేదు. ఇక హీరోయిన్‌లుగా తమన్నా, నయనతార ఇద్దరూ ఎప్పట్లాగే బాగా నటించినా, తమన్నా క్యారెక్టర్‌కు ఎలివేషన్ కాస్త ఎక్కువగా ఉంటుంది. పాటలు, సాంకేతిక నిపుణుల పనితీరు సినిమాకు అధనపు బలం. అక్కడక్కడ చిరంజీవి మేకప్‌పై సరైన శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల వయస్సు పైబడినట్లు కనపడుతూనే ఉంటుంది.
ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ఈ సినిమా మంచి అవకాశం. సైరా సురేందర్‌రెడ్డి గ్రాఫ్‌ను నెక్ట్స్‌లెవల్‌కు తీసుకెళ్తుంది అనటంలో ఎలాంటి సందేహాం లేదు.
ప్లస్ పాయింట్స్
ఫస్ట్ ఆఫ్ ఎండింగ్ సీన్
క్లైమాక్స్
చిరంజీవి సహా నటీ-నటుల నటన
దర్శకత్వం, పాటలు, రచన
మైనస్ పాయింట్స్
సినిమా సాగదీత
అనవసరపు ప్రేమ సీన్స్