కౌన్ బనేగా కరోడ్ పతిలో రాజస్తాన్ కు చెందిన ప్రేరణ ఓ గమ్మత్తైన ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆట నుంచి నిష్క్రమించింది. రూ.3.20 లక్షలతోనే సరిపెట్టుకొని వెనుదిరగాల్సి వచ్చింది. కౌన్ బనేగా కరోడ్ పతి పదకొండో ఎపిసోడ్ లో రాజస్థాన్ ఝున్ ఝున్ కు చెందిన ప్రేరణ హాట్ సీట్ లో కూర్చుంది. అప్పటికే ఆమె చేతిలో మూడు లైఫ్ లైన్స్ ఉన్నవి. ఆటపై చాలా విశ్వాసంతో ఉన్న ప్రేరణ మూడో క్వశ్చన్ నుంచి గేమ్ స్టార్ట్ చేసింది. కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలే చెప్పిన ప్రేరణ… ఆ తర్వాత మూడు లైఫ్ లైన్స్ ను వాడేసుకుంది. ఐశ్వర్య అనే సినిమాతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన నటి ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. ఐశ్వర్యారాయ్, దీపికా పడుకొనే, ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్ అనే ఆప్షన్స్ లో సరైన దాన్ని గుర్తించలేకపోయింది. ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం చెబితే రూ.6.40 లక్షలు గెలుస్తుంది. చెప్పకుండా ఆట నుంచి నిష్క్రమిస్తే రూ.3.20 లక్షలు దక్కుతాయి. సమాధానం చెప్పలేక రూ.3.20 లక్షలు తీసుకొని ఆట నుంచి డ్రాప్ అయ్యింది.
అయితే ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పడుకొనే మొదటి సారిగా ఆశ్యర్యరాయ్ అనే కన్నడ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిందనే విషయం చాలా మందికి తెలియదు. ఆ సినిమాలో దీపికా ఉపేంద్ర సరసన నటించారు. కానీ అందరూ దీపికా మొదటిసారిగా ఓం శాంతి ఓం సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైందనుకుంటారు.