బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పై బీజేపీ మహిళా నేత, సినీనటి జీవిత రాజశేఖర్ ఫైర్ అయ్యారు. కౌశిక్ రెడ్డి ఓ రౌడీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అతడికి ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదని మండిపడ్డారు.
హుజూరాబాద్ నియోజక వర్గంలోని జమ్మికుంటలో బీజేపీ నిర్వహించిన ప్రజా గోస..బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ సభకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఇన్ డైరెక్ట్ గా కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ నియోజక వర్గాన్ని అప్పగించే ప్రయత్నం చేస్తున్నాడని కానీ, కౌశిక్ కు మహిళలంటే గౌరవం లేదన్నారు.
స్వయంగా మా బంధువుల విషయంలోనే అతడు పరుషంగా మాట్లాడి చివరకు సారీ చెప్పి వెనక్కి తగ్గాడని అన్నారు. గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలుసని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో పీకింది ఏమిటి అంటే.. ఒక్కడూ సమాధానం చెప్పరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను ఉద్దరించనోళ్లు బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని, కేసీఆర్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.