– ముగిసిన కవిత విచారణ
– 9 గంటలపాటు విచారించిన అధికారులు
– కవితను ప్రశ్నించిన ఐదుగురు అధికారుల బృందం
– రామచంద్ర పిళ్లైతో కలిసి కవిత విచారణ
– ఈడీ ఆఫీస్ నుంచి బయటకొచ్చి సైలెంట్ గా వెళ్లిపోయిన కవిత
– ముఖ్యంగా సెల్ ఫోన్ల ధ్వంసంపై ఆరా తీసిన ఈడీ
– హైదరాబాద్ మీటింగులపైనా ఆరా తీసినట్టు సమాచారం
– లిక్కర్ స్కాం కేసులో కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ
– 7 గంటలకు పైగా ప్రశ్నిస్తున్న అధికారులు
– ఈడీ కార్యాలయం దగ్గర పోలీసుల అలర్ట్
– మీడియా, బీఆర్ఎస్ నేతలను దూరంగా పంపిన పోలీసులు
– కాసేపట్లో రాజ్ భవన్ కు బీఆర్ఎస్ నేతలు
– గవర్నర్ ను కలవనున్న మేయర్, డిప్యూటీ మేయర్
– బండి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయనున్న నేతలు
– అపాయింట్ మెంట్ ఇవ్వని గవర్నర్
– గేటు దగ్గర వినతిపత్రం ఉంచాలని బీఆర్ఎస్ నేతల నిర్ణయం
– ఈడీ కేంద్ర కార్యాలయంలో 5 గంటలుగా కవిత విచారణ
– మహిళా అధికారి సమక్షంలో వీడియో షూట్
– ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలపై ప్రశ్నలు
– రామచంద్ర పిళ్లైతో పాటే కవిత విచారణ
– పిళ్లై రిపోర్ట్, బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా ప్రశ్నల వర్షం
– మధ్యాహ్నం 2 గంటల సమయంలో లంచ్ బ్రేక్
– రేపు మరోసారి విచారణకు హాజరుకావాలని సూచించే అవకాశం
– ఢిల్లీ పరిణామాలపై ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరా
– కేటీఆర్, హరీష్ రావును వివరాలు అడిగి తెలుసుకుంటున్న కేసీఆర్
– ఒకవేళ, కవిత అరెస్టైతే ఆందోళనలకు బీఆర్ఎస్ ప్లాన్
– బండి సంజయ్ పై పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు
– కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేసిన దానం నాగేందర్
– బండిపై ఎస్ఆర్ నగర్ పీఎస్ లోనూ ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ శ్రేణులు
– హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ ఆందోళన
– బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
– కవితకు క్షమాపణలు చెప్పాలని తలసాని సాయి కిరణ్ డిమాండ్
– బీజేపీ నేతల్ని తెలంగాణలో తిరగనివ్వం: సాయి కిరణ్
– ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మహిళా నేతల ప్రెస్ మీట్
– తెలంగాణ గడ్డపై పుట్టినవారు కేసులకు భయపడరు: సత్యవతి రాథోడ్
– కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పోరాటం చేశారు
– బీజేపీ మెడలు వంచే రోజులు దగ్గరరలోనే ఉన్నాయి
– 2018 ఎన్నికల్లో తెలంగాణలో ఎన్నిచోట్ల డిపాజిట్లు వచ్చాయి
– మహిళా లోకం తిరగబడితే బండి సంజయ్ అధోగతే
– బీజేపీ నేతలు నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడవద్దు
– బండి సంజయ్ ని బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలి: సత్యవతి రాథోడ్
– బండి సంజయ్ వ్యాఖ్యలు సమాజం తలదించుకునేలా ఉన్నాయి
– ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? లేక పార్టీ వైఖరా?
– బీజేపీలోని దొంగలపై ఎన్ని ఈడీ కేసులు పెట్టారు
– ఈడీని వేట కుక్కలా ఉసిగొల్పుతున్నారు
– చీమ చిటుక్కుమంటే స్పందించే గవర్నర్ బండి వ్యాఖ్యలపై ఎందుకు స్పందించరు
– బండి సంజయ్, బీజేపీకి డిపాజిట్లు కూడా రావు: సత్యవతి రాథోడ్
– మహిళలకు బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలి: సబితా ఇంద్రారెడ్డి
– కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప మీకేం తెలుసు
– కేసీఆర్ ను చూసి బీజేపీ నేతలకు భయం పట్టుకుంది
– దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పి కక్ష సాధిస్తున్నారు: సబిత
– కవితను అరెస్ట్ చేసే అవకాశముంది: చింతల రామచంద్రారెడ్డి
– అవినీతి ఎవరు చేసినా జైలుకు వెళ్లాల్సిందే!
– సెక్షన్ 19 కింద కవితను అరెస్ట్ చేయొచ్చు: చింతల రామచంద్రారెడ్డి
– లిక్కర్ స్కాంపై మేమే ఫిర్యాదు చేశాం: పవన్ ఖేరా, ఏఐసీసీ అధికార ప్రతినిధి
– మా పోరాటంతోనే లిక్కర్ స్కాంలో కదలిక వచ్చింది
– మా ఒత్తిడి వల్లే సీబీఐ కవిత ఇంటికి వచ్చి విచారించింది
– బీఆర్ఎస్ కుటుంబానికి వీఆర్ఎస్ ప్రకటించాలి: పవన్ ఖేరా
– ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి: ఎంపీ మాలోతు కవిత
– ఆమెపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
– లేదంటే.. తెలంగాణ ప్రజలు చెప్పుతో కొట్టి బుద్ది చెబుతారు: మాలోతు కవిత
– ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష
– ఢిల్లీ పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆరా
– ఈడీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన
– పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
– ఈడీ కార్యాలయంలో కొనసాగుతున్న విచారణ
– కవితను ప్రశ్నిస్తున్న ఐదుగురు అధికారుల బృందం
– రెండు గంటలకు పైగా విచారణ
– 11 గంటలకు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన కవిత
– కాసేపట్లో లంచ్ బ్రేక్ ఇచ్చే అవకాశం
– కవిత అరెస్ట్ జరిగితే నిరసనలకు బీఆర్ఎస్ ప్లాన్
– ఈడీ ఆఫీస్ ఎదుట బైఠాయించాలని మంత్రులు, ఎమ్మెల్యేల నిర్ణయం
– ఆప్ మద్దతుతో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలకు ప్లాన్
– ఆప్ నేతలతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు
– ఢిల్లీకి భారీగా చేరుకున్న బీఆర్ఎస్ నేతలు
– బీఆర్ఎస్ భవన్ లో బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు
– తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం
– కవితపై బండి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం
– సంజయ్ పై మహిళా నేతలు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం
– ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో కవిత విచారణ
– ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో దర్యాప్తు
– కవితను ప్రశ్నిస్తున్న ఐదుగురు అధికారుల బృందం
– ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో కవిత దర్యాప్తు
– కవిత వెంట వచ్చిన ఆమె భర్త అనిల్, అడ్వకేట్లు
– వారిని బయటే నిలిపివేసిన పోలీసులు
– కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఒక్కరే ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లిన కవిత
– భారీ ర్యాలీగా ఈడీ ఆఫీస్ కు వెళ్లాలని కవిత చూడగా అనుమతివ్వని పోలీసులు
– ఆమె కారుతో పాటు మరో కారుకు మాత్రమే అనుమతి
– కవిత విచారణ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయం దగ్గరకు బీఆర్ఎస్ శ్రేణులు
– అప్రమత్తమైన పోలీసులు
– ఈడీ కేంద్ర కార్యాలయం వద్ద 144 సెక్షన్
– భద్రతను కట్టుదిట్టం చేసి.. భారీగా బలగాల మోహరింపు
– లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
– ఈడీ ఆఫీసు లోపలికి వెళ్లిన కవిత
– అందరికీ అభివాదం చేస్తూ లోపలికి వెళ్లిన కవిత
– కవితకు మద్దతుగా ఈడీ ఆఫీసు గేట్ వరకూ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు
– భారీగా పోలీసులు మోహరింపు
– ఈడీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. విచారణలో కవితతో పాటు కేసులో నిందితులుగా ఉన్న మరో 9 మందిని కలిపి ఒకేసారి ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అరుణ్ పిళ్లై, దినేష్ అరోరా, గోరంట్ల బుచ్చిబాబు, అరవింద్, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, విజయ్ నాయర్ లను కలిపి ఈడీ విచారించనుందని వార్తలు వస్తున్నాయి.
– విచారణకు కొద్ది నిమిషాల ముందు కవిత.. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఆమె ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఎదుట విచారణకు వెళ్లారు.
– ‘‘పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తాయి. అంత మాత్రాన వేట ఆపుతామా, కేసీఆర్ కుటుంబ సభ్యులమైన మేమందరం, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరం మీ ధర్మ పోరాటంలో మీతోపాటు ఉన్నాము. ఉంటాము కూడా. ధర్మం మీ వైపు ఉంది. అంతిమ విజయం మీదే. మనదే’’ అంటూ కవితకు ధైర్యం చెబుతూ.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
– ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరు నేపథ్యంలో ఆమెకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. కార్యకర్తలను అదుపు చేసేందుకు పెద్దఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు.