బిల్కిస్ బానో అత్యాచార దోషులు 11 మందిని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. తాజాగా, దోషుల్లో ఒకరు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల తో వేదికను పంచుకోవడం గమనార్హం. మార్చి 25న దహోడ్ జిల్లా కర్మాడీ గ్రామంలో నీటి సరఫరా పథకం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ జస్వంత్ సిన్హ్ భభోర్, అతడి సోదరుడు ఎమ్మెల్యే శైలేశ్ భభోర్‌లు హాజరయ్యారు.
వారితో పాటు బిల్కిస్ బానో అత్యాచార కేసు దోషి శైలేశ్ చిమ్నాలాల్ భట్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని గురించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
కవిత ట్విట్ చేస్తూ..బిల్కిస్ బానో రేపిస్ట్ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో బహిరంగంగా వేదిక పంచుకుంటాడు.మహిళలపై క్రూరమైన నేరాలకు పా్పలడేవారికి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటుంటే..సంబరాలు చేసుకుంటున్న సమాజంగా మనం ఏమైపోయాం. భారతదేశం చూస్తోంది అంటూ పేర్కొన్నారు.
Bilkis Bano Rapist openly shares stage with BJP’s MPs and MLAs.
What have we become as a community that perpetrators of heinous crimes against women are being celebrated and given a platform while the victims plead for justice.
India is watching! https://t.co/D90SiH84fC
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 27, 2023
అదే విధంగా టీఎంసీ ఎంపీ మొయిత్రా స్పందిస్తూ బిల్కిస్ బానో యొక్క రేపిస్ట్ గుజరాత్ లోని బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేతో వేదికను పంచుకున్నాడు. నేను ఈ రాక్షసులను తిరిగి జైలులో చూడాలనుకుంటున్నాను. తాళం చెవి విసిరేయాలి. న్యాయం యొక్క ఈ అపహాస్యాన్ని ప్రశంసించే ఈ సాతాను ప్రభుత్వానికి ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను. భారతదేశం తన నైతిక దిక్సూచిని తిరిగి పొందాలని నేను కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు.
Bilkis Bano's Rapist Shares Stage With Gujarat's BJP MP, MLA.
I want to see these monsters back in jail & the key thrown away. And I want this satanic government that applauds this travesty of justice voted out. I want India to reclaim her moral compass. pic.twitter.com/noaoz1c7ZW
— Mahua Moitra (@MahuaMoitra) March 26, 2023
కాగా, శైలేష్ ముందస్తు విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమంలో అతడు పాల్గొనడం చర్చనీయాంశమవుతోంది. యావజ్జీవిత ఖైదు పడ్డ అత్యాచార దోషులకు జైలు నుంచి విడుదలైనప్పుడు పూలమాలలతో స్వాగతం పలికి, వీరతిలకాలు దిద్దడం అప్పట్లో వివాదాస్పదమైంది. మరోవైపు, దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు ఇటీవల అంగీకరించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ , జస్టిస్ జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ అంశంపై తదుపరి విచారణను మే 9కి వాయిదా వేసింది. దేశంలో సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచారం, హత్య కేసు దోషులను వదిలిపెట్టాలని గుజరాత్ ప్రభుత్వ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం కేసు తెరపైకి వచ్చింది. అదే సమయంలో, ఆమె కుటుంబ సభ్యులు ఏడుగుర్ని హత్య చేసిన దుర్మార్గులు.. ఐదు నెలలు గర్భవతిగా ఉన్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దోషులను ముందస్తు విడుదల అంశాన్ని సుప్రీంకోర్టు సైతం తీవ్రంగా పరిగణించింది.