మాజీ ఎంపీ కవిత. 2019 ఎంపీ ఎన్నికల తరువాత ఆమె ప్రస్తావన తెలంగాణ రాజకీయాల్లో కాస్త తగ్గిందనే చెప్పారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తరువాత.. ఇంతకు ముందులా యాక్టి్వ్ లేరు. అయితే, ఇటీవల ఆమెను ఎమ్మెల్సీగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. దీంతో, మరోసారి ఆమె యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్నారట. దీని కోసం ఓ సోషల్ మీడియా టీం ను కూడా సిద్ధం చేసుకుందని తెలుస్తుంది.
గతంలో ఆమె రాష్ట్రంలోని కొన్ని సంఘాలకు గౌరవాధ్యక్షురాలిగా ఉండేది. కానీ, ఎంపీగా ఓడిపోయిన తరువాత చాలా విషయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే, ఇప్పుడు వారందరికి టచ్ లోకి వెళ్లాలని చూస్తున్నారని సమాచారం. మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆయన తరహాలోనే సామాజిక మాద్యమాల ద్వారా అందరికి అందుబాటులో ఉన్నానని చెప్పేందుకు కవిత 25 మందితో కూడిన ఓ టీం ను రెడీ చేసుకున్నారు.
హైదరాబాద్ కు చెందిన ఓ యువనేత ఈ టీంకు నాయకత్వం వహిస్తున్నారని తెలుస్తుంది. కేటీఆర్ తరహాలోనే “ సోషల్ మీడియా.. ఆన్సర్ ఫ్రమ్ కవిత’ అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. వారానికి ఒకసారి లైవ్ లోకి వచ్చి చిట్ చాట్ కార్యక్రమం పెడతారట. నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.