‘కౌన్ బనేగా కరోడ్ పతి 11’ చివరి వారం ఎపిసోడ్ ఈ నెల 29 శుక్రవారం ప్రసారం కాబోతోంది. ఎప్పటి మాదిరిగానే ఈ కార్యక్రమాన్ని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తుండగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్, రచయిత, దాత, సుధా మూర్తి ఈ ఎపిసోడ్ లో పాల్గొనడానికి వస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ టీజర్ ను సోని టీవీ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఏర్పాటుతో గొప్ప సోషల్ వర్కర్ గా పేరు తెచ్చుకుందని సుధా మూర్తి గురించి అమితాబ్ బచ్చన్ ఆ టీజర్ లో ఇంట్రో ఇస్తాడు. సుధా మూర్తి తన కాలేజీ లైఫ్ లో, జీవితంలో జరిగిన సంఘటనలు, దాతగా తాను చేసిన సామాజిక సేవలను చెబుతుంటే ప్రేక్షకులు ఆసక్తిగా వింటుంటారు.
టీజర్ లో సుధా మూర్తి మాట్లాడుతూ…’కర్ణాటకలోని హుబ్లీ ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం 599 స్టూడెంట్స్ లో నేనొక్కదాన్నే అమ్మాయిని.. నాకు ప్రిన్సిపాల్ మూడు కండీషన్స్ పెట్టారు. ఒకటి కాలేజీకి చీర కట్టుకొని రావాలి…కాలేజ్ క్యాంటీన్ కు వెళ్లొద్దు…అబ్బాయిలతో మాట్లాడొద్దు’ మొదటిది ఓకే. కాలేజీ క్యాంటీన్ చెత్తగా ఉంటది కాబట్టి నేను వెళ్లను…మూడోది అని చెబుతుంటే షో లో పాల్గొన్న వారి నుంచి పెద్దగా అరుపులు వినిపిస్తుంటాయి’ మూడో కండిషన్ గురించి సుధా మూర్తి ఆసక్తి కరమైన సమాధానం చెప్పారు. ‘ఒక సంవత్సరం అబ్బాయిలతో మాట్లాడలేదు…రెండో సంవత్సరం నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని తెలుసుకొని వాళ్లే నా దగ్గరకు వచ్చారు’ అంటూ నవ్వుతూ చెప్పేవారికి సరికి షో లో కూర్చున్నవాళ్లు పెద్దగా చప్పట్లు కొడతారు.
ఐదు నిమిషాల నిడివి గల టీజర్ లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా 16000 టాయ్ లెట్ల నిర్మాణం, దేవదాసీ కమ్యూనిటీకి చేసిన సహాయం గురించి కూడా సుధా మూర్తి చెప్పారు.
టీజర్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ అయిన కొన్ని గంటల్లోనే వేలాది మంది చూశారు. ఇది ఇప్పుడు యూ ట్యూబ్ లో వైరలవుతోంది.