తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ తెలంగాణ ముద్ర కో-అపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ తిప్పినేని రామదాసప్ప నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్ 67వ జన్మదినం పురస్కరించుకుని భర్కత్ పురా లోని సొసైటీ కార్యాలయంలో ఆయన తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రాన్ని అగ్రగామిగ నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ , ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారన్నారు. అటువంటి మహానేతకు భారతరత్న తో సత్కరించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.