హైదరాబాద్: దేవీపట్నం దగ్గర బోటు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా రవాణా శాఖ మంత్రి అజయ్‌ను ఆదేశించారు. గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో దాదాపు 50 మంది గల్లంతవ్వగా అందులో 36 మంది తెలంగాణవాసులు ఉన్నారు.