ఉద్యోగులకు కేసీఆర్ దసరా గిఫ్టు ఇస్తారా? లేక కుక్క.. తోక ఊపుతుందా..? లేక తోక.. కుక్కను ఊపుతుందా..? అనే ధర్మ సందేహంలో ఫిట్‌మెంట్ మేటర్ పక్కకు పెడతారా? ఐఆర్ కాకుండా ఫిట్‌మెంట్ ఇస్తామని హరీశ్‌రావు ఇచ్చిన హామీ నెరవేరుతుందా?

ప్రగతి భవన్‌లో మంగళవారం సాయంత్రం సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పీఆర్సీతో పాటు 61 లేదా 60 ఏళ్లకు వ యోపరిమితిని పెంచే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. గరిష్ఠంగా ఉద్యోగుల వయోపరిమితిని 2 ఏళ్లకు పెంచే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగానే పరిశీలిస్తోంది.
మరోపక్క మరో వాదన కూడా వినిపిస్తోంది. ఆర్థికమాంద్యం తీవ్రంగా ఉండడంతో ఫిట్‌మెంట్ నిరాశగానే ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.
ఇలావుంటే, ఆర్టీసీ సమ్మెపైనా మంత్రిమండలిలో చర్చ జరిగే అవకాశాలు వున్నాయి. 5 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు ఆర్టీసీ యూనియన్లు ప్రకటించడంతో దసరా పండగకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. దీంతో సమ్మె అంశం కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఆర్టీసీ వర్గాలు కూడా తమకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చునని అంచనా వేస్తున్నాయి. ఒకరకంగా హుజూర్‌నగర్ ఉపఎన్నికకు ముందు జరుగుతున్న ఈ భేటీ ఆ ఎన్నికలో టీఆర్ఎస్ విజయావకాశాల్ని నిర్దేశించేదిగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఇలావుంటే, హుజూర్‌నగర్ బైపోల్‌కు సంబంధించిన అంశంపై ప్రధానంగా మంత్రిమండలి ఫోకస్ పెడుతుంది. హుజూర్‌నగర్‌లో పాగా వేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా ఈ భేటీలో సీఎం కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.