హైదరాబాద్ మణికొండలో మరమ్మతులో ఉన్న నాలాలో పడి మృతి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రజనీకాంత్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు….మణికొండ మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజినీర్ వితోబాను సస్పెండ్ చేశారు.
దీంతో పాటు మరమ్మతులు జరుగుతున్న సమయంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు, చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించిన గుత్తేదారు రాజ్‌కుమార్‌పై నార్సింగ్ పోలీసులు కేసునమోదు చేశారు. ఇక ఈనెల 25న రాత్రి 9గంటల సమయంలో భారీ వర్షం కారణంగా మరమ్మతుల కోసం తీసిన గుంతలో పడి రజనీకాంత్‌గల్లంతయ్యారు. సోమవారం అతని మృతదేహం నెక్నాంపూర్ చెరువులో లభ్యమైంది.