కాంగ్రెస్ పార్టీ ‘దుర్మార్గాల బ్రీడింగ్ సెంటర్’ అంటూ ఆదివారం శాసనసభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘దుబాయ్ శేఖర్’గా కేసీఆర్ పేరు తెచ్చుకుంది కాంగ్రెసులో ఉన్నప్పుడే అంటూ ఆయన పాత మిత్రులు గుర్తు చేసుకుంటున్నారు. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా వుంటూ కొద్దిమందిని గల్ఫ్ పంపే సందర్భంగా ఈపేరు వచ్చిందని అంటున్నారు. అప్పుడు కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయంటున్నారు. గల్ఫ్ పంపే పేరుతో మమ్మల్ని మోసం చేశాడని అప్పట్లో కొందరు ఆరోపించారు. బహుశా అది గుర్తుపెట్టుకొని ఈ మాటలు వాడి వుంటారని చేసిఉంటాడని అనుకుంటున్నారా. పైగా ఆతరువాత దొంగనోట్ల చెలామణి ఆరోపణలు కూడా ఎదుర్కొన్న విషయాన్ని కూడా గుర్తుచేస్తున్నారు.
కాంగ్రెస్ దుర్మార్గుల బ్రీడ్ సెంటర్ అన్న సంగతి కేసీఆర్‌కు ఇప్పుడే గుర్తు వచ్చిందా ? లేక గతంలోనే గుర్తించి ఇప్పుడు ప్రస్తావించారా ?అన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో జరుగుతుంది.ఇప్పుడే ఎందుకు కాంగ్రెస్‌పై అంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అనే సందేహం వ్యక్తంచేస్తున్నారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చెప్పినట్లు దుర్మార్గుల బ్రీడ్ సెంటర్ అయితే 2004లో ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్లు… వైఎస్ క్యాబినెట్‌లో ఎందుకు చేరినట్లు…? అంతదాక ఎందుకు.. కొద్దిరోజుల కిందటనే కదా కాంగ్రెస్ శాసనసభా పార్టీని టీఆరెస్‌లో విలీనం చేసుకుంది. దుర్మార్గుల బ్రీడింగ్ సెంటర్ నుంచి వచ్చిన వారిని ఎందుకు చేర్చుకున్నట్లు..? ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో టీఆరెస్‌ని విలీనం చేస్తానని ఎందుకు చెప్పినట్లు ? అనే మాట కూడా ఇక్కడ మళ్లీ ప్రస్తావనకు వస్తోంది. బహుశా సోనియాగాంధీని మోసంచేసే ఉద్దేశంతో నైనా ఆ ప్రకటన చేసి ఉండాలి లేదా.. ఆ నాటికి కేసీఆర్ దృష్టిలో ఇంకా కాంగ్రెస్ మంచి పార్టీ అన్న భావనే ఉండి ఉండాలి. అందుకే కుటుంబ సభ్యులతో సహా వెళ్లి సోనియాతో ఫోటో దిగి ఉంటాడు అంటున్నారు అనలిస్టులు. మరోవైపు ఇదే సభలో ఇప్పుడు కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వం కాదు భట్టి గారు.. ప్రస్తుతం ఉన్న ఆర్థిక మాంద్యానికి మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? రేపు అవసరమైతే మీరు మీము కలసి కేంద్రానికి వ్యతిరేకంగా కోట్లడాల్సి రావచ్చు.. మీకు ఆ తెలివి కూడా లేదు. మీకు దేని మీద మాట్లాడాలో.. దేనిమీద స్పందించాలో కూడా తెలియడంలేదు. అందుకే మీ పార్టీ ఇలా తయారయింది.. అంటూ సెటైర్లు విసిరాడు అంటూ గుర్తు చేస్తున్నారు. బహుశా తన ప్రభుత్వంపై ప్రజలలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను దృష్టి మళ్ళించే ప్రయత్నం కావచ్చంటున్నారు. అంతే కాకుండా త్వరలో జరిగే హుజుర్‌నగర్ ఉప ఎన్నిక కూడా మరో కారణం అయివుంటుందని కూడా అంటున్నారు. అందుకే హుజుర్‌నగర్‌లో ప్రధాన పోటీ కాంగ్రెస్‌తోనే కనుక ఆ పార్టీని టార్గెట్ చేస్తూనే బీజేపీపై కూడా మాటల దాడి చేశాడని విశ్లేషిస్తున్నారు. మరోవైపు తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేశాడని చెబుతున్నారు. అందులోభాగంగానే రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీనే సరైనదని, ప్రాంతీయ పార్టీలకు ఆత్మగౌరవం ఉంటుందని, జాతీయ పార్టీలు ఢిల్లీ వాళ్లు చెప్పినట్లు వింటారంటూ సభలో మాట్లాడాడని విశ్లేషిస్తున్నారు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరన్నది సత్యం.