సీఎం కేసీఆర్ ప్రకటించిన జాతీయ పార్టీపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీపై ఆయన తనదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందించారు. టీఆర్‌ఎస్ ను బీఆర్‌ఎస్‌గా మార్చి సీఎం కేసీఆర్ తొలి ఆది పురుష్ అయ్యారని అన్నారు.
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ కు స్వాగతం అంటూ వర్మ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా కామెంట్స్ చేస్తున్నారు. కేసీఆర్‌ను ఆదిపురుష్ అనడం పొగడ్త లేదా విమర్శ అనే సందేహం కలుగుతోందన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆదిపురుష్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. టీజర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. హిందూ దేవతలను ఈ సినిమా టీజర్‌లో దర్శకుడు ఓం రౌత్ తప్పుగా చూపించాడంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ టీజర్‌లో హిందూ దేవతల వస్త్రధారణ చాలా భిన్నంగా ఉందంటున్నారు. హనుమంతుడు లెదర్ వేసుకున్నట్లు చూపడం తప్పని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ సినిమాపై అధికంగా ట్రోల్స్ నడుస్తున్నా టీజర్ మాత్రం రికార్డులను సృష్టిస్తోంది. కేవలం 24 గంటల్లో వంద మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన టీజర్‌గా ఆదిపురుష్ రికార్డు సాధించింది.