హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన వెంటనే…. టిఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన సైదిరెడ్డి పేరునే కేసీఆర్ ఖరారు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, స్వల్ప తేడాతో ఓటమి పాలయినందున, ఈసారి కూడా తనకే అవకాశం ఇచ్చారని టీఆరెఎస్ ప్రకటన విడుదల చేసింది. అయితే… ఈ నిర్ణయంపై 2014లో టీఆర్ఎస్ తరుపున హుజుర్ నగర్ లో పోటీ చేసిన తెలంగాణ అమరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » శంకరమ్మకు నో ! సైదిరెడ్డికి సై